శివుడి ఆజ్ఞ వచ్చింది.
ఎంతైనా, శివుడు ఆజ్ఞ లేకపోతే సెల్ ఫోన్ కూడా రింగ్ కాదు కదా !
అందుకే, మళ్ళీ మరో ప్రయత్నం ..
అయితే, కొంచం వెరైటీగా ..ఈసారి చెప్పేది నా కథ కాదు…
‘ఎవరి కథ’ అన్నది ఇప్పుడే చెప్పేస్తే ఎలా? తినబోతూ ఉంటే taste చెప్పెస్తే, అల్లు అర్జున్ యాసలో ‘చాల బాగోదు’ 🙂
ఇక్కడ కథాస్థలం మనకు తెలిసిన లొకేషనే – ‘బాహుబలి’ లో చూపించినట్టు మాహిష్మతి సామ్రాజ్యాన్ని graphics తో చూపిండానికి మనకి నాలుగు సంవత్సరాల టైం లేదుగా మరి. పైగా మనది లోబడ్జెటాయే …
ఇందులో కథానాయకుడు లేక కథానాయకి మనలో ఒకరు. పైగా, కొంచం విపర్య తర్కం use చేసి చెప్పాలంటే’, మేధావి’ కూడా! (తర్కశాస్త్రం లో ‘విపర్యం’ అని ఒకటుంది. ఇంగ్లీష్ లో ‘converse’ అంటారు కదా. అదన్న మాట.)
ఎందుకంటే, గౌరవనీయులు KCR గారు ‘వాడో సన్నాసి’ అని దీవించని వాళ్ళందరూ ఇలా ‘మేధావి’ క్యాటగిరీలోకి ఆటోమేటిగ్గా వస్తారు కదా !
ఆకతాయితనం, సోమరితనం లాంటి వగైరా వగైరా ‘తనం’ categories లో ఈ ‘మేధావితనం’ కూడా ఒకటని కొందరిని చూడగానే తెలుస్తుంది. ఈ కథలకి వస్తువు అలాంటి వాళ్లే.
ఇలా హద్దులు లేని ‘మేధావితనం’ తో ఇబ్బందిపడుతూ ఉండేవాళ్ళ గోల ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోనందువలన, కొంచం కష్టమైనా, ఆ బాధ్యతను ఎత్తుకొని ఈ సిరీస్ మొదలెట్టడమైనది.
షరా మాములుగా, ఇందులో పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు. ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కావు.
అయితే, ఈ కథల్లో వ్యక్తులు లేక కథానాయకులు లేక కథానాయికలు, అచ్ఛు గుద్దినట్లు మీలానే లేదా మీకు తెలిసిన వాళ్ళలా ఉన్నా/ మాట్లాడినా, అది కేవలం ఆ ‘పైవాడి’ అనేకానేక లీలలో ఒకటి అని గమనించ ప్రార్ధన. ! అందువలన చేత, ఇందులో రచయితగా నేను వండి వార్చిన ‘స్పెషల్ effects’ ఏమి లేవని నొక్కి వక్కాణించడమైనది.
BTW, ఇలాంటి ‘కాకతాళీయాలని’ పెస్సిమిస్టులు ‘నా ఖర్మ’ అని అనుకున్నా, మేధావులు మాత్రం ‘ఏంటో ఈ విష్ణు మాయ’ అని అనుకుంటారని, మీకు బాగా తెలుసు కదా!
సరే. ఇక మన కథ మొదలెడదాం …
(To be continued…)